ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) మోడీ తన నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు.. 93ఏళ్ల బాదల్ పాదాలకు మోడీ నమస్కారం చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీజేపీ నేతలు, మోడీ మద్దతుదారులు ఆయన్ను ట్విట్టర్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నేతలతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ.. బీహార్ సీఎం నితీశ్ కుమార్, అన్నాడీఎంకే ఓ పన్నీర్ సెల్వం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో బాదల్ పాదాలకు మోడీ నమస్కారం చేశారు.
ఈ ఫొటోను ట్విట్టర్ లో బీజేపీ నేత అమిత్ రక్షిత్ షేర్ చేశారు. ‘ఈ ఏడాదిలో అరుదైన దృశ్యం. వారణాసిలో తన నామినేషన్ వేయడానికి ముందు మోడీ.. ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు’ అని అమిత్ తెలిపారు.
ఆ తర్వాత ప్రధాని మోడీ.. మహిళా కాలేజీ ప్రిన్సిపల్ అన్నపూర్ణ శుక్లా (92) కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. యూపీలోని వారణాసి నుంచి మోడీ.. రెండోసారి పోటీ చేస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 25, 2019) వారణాసిలో నిర్వహించిన భారీ ర్యాలీలో మోడీ పాల్గొన్నారు.
PM Modi touching Sardar Prakash Singh Badal ji’s feet. Embodiment of Indian culture. #DeshModiKeSaath pic.twitter.com/HyV6TrJprv
— Chowkidar Onkar Pandey (@iOnkarPandey) April 26, 2019