PM Modi Elephant Safari : అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్

1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం.

PM Modi

PM Modi in Kaziranga Park : ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మోదీ కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడి పార్కులో పరిసరాలను మోదీ ఆస్వాదించారు. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం.

Also Read : Sunil Gavaskar : సర్ఫరాజ్.. ఆ చెత్త షాట్ అవసరమా? సునీల్ గవాస్కర్ కీలక సూచన

కజిరంగా నేషనల్ పార్క్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఓపెన్ టాప్ జీప్ పై పర్యటించిన ప్రధాని.. పార్కులోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. నేషనల్ పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, అటవీ శాఖ చెందిన ఉన్నతాధికారులు కూడా ప్రధాని మోదీతో ఏనుగులపై సఫారీలో పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. కాజిరంగా నేషనల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.