Arvind Kejriwal Wife : ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం.. మీ సీఎం.. మీ వెంటే ఉన్నారు : కేజ్రీవాల్ సతీమణి సునీత కామెంట్స్!

Arvind Kejriwal Wife : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ బృందం కస్టడీలోకి తీసుకున్న ఒక రోజు తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు.

Arvind Kejriwal Wife : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న ఒక రోజు తర్వాత మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీతా స్పందించారు.

Read Also : Lok Sabha elections 2024: ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రభావం చూపనున్న 10 కీలక అంశాలు ఇవే..

‘మోదీజీ మూడుసార్లు ఎన్నికైన మీ ముఖ్యమంత్రిని అధికార అహంకారంతో అరెస్టు చేశారు. అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. లోపల (జైలు) అయినా బయట అయినా.. జీవితం దేశానికే అంకితం.. ప్రజలకు ప్రతిదీ తెలుసు. జై హింద్’ అంటూ సునీతా కేజ్రీవాల్ ట్విట్టర్ (X) వేదికగా పేర్కొన్నారు.

ఈడీ అరెస్టు తర్వాత తొలిసారిగా కేజ్రీవాల్ స్పందన :
అంతకుముందు రోజు, ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీ కోరుతూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చింది. విచారణ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆప్ అధినేత కీలక కుట్రదారుగా పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని రూపొందించి అమలు చేసినందుకు ‘సౌత్ గ్రూప్’ నుంచి అనేక కోట్ల రూపాయలను కిక్‌బ్యాక్‌గా స్వీకరించారని ఈడీ ఆరోపించింది. గురువారం రాత్రి ఈడీ అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌ తొలిసారిగా స్పందించారు. దర్యాప్తు సంస్థ ఆరోపణలను తోసిపుచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. జైలులో ఉన్నా బయట ఉన్నా నా జీవితం జాతి సేవకే అంకితమని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా అన్నారు.

కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నిరసనలు..
ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆయన అరెస్టును రాజకీయ కుట్రగా పలువురు ఆప్ నేతలు అభివర్ణించారు. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్నా ఆ పార్టీ, ఆయన అరెస్టు తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో నిరసన సందర్భంగా ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌తో సహా పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also : KCR: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు