Jammu and Kashmir: పీఓకేలో పర్యటించిన అమెరికా ప్రతినిధి.. ఖండించిన భారత్

అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది.

Pok

Jammu and Kashmir: అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది. అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హర్ ఒమర్ అధికారిక పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల ఆమె, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. అయితే, తర్వాత ఇల్హర్ ఒమర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా పర్యటించింది. దీంతో ఈ చర్యను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.

Jammu and Kashmir : కాశ్మీర్‌‌లో ఎన్ కౌంటర్.. LeT కమాండర్ హతం

‘‘భారత ప్రాదేశిక ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లోని కొంత భాగం ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉంది. అలాంటి చోట ఇల్హన్ ఒమర్ పర్యటించింది. ఆమెలాంటి రాజకీయ నాయకురాలు సంకుచిత మనస్తత్వంతో ఇలాంటి పనులు చేసుకుంటే చేసుకోనివ్వండి. అయితే, అది మా భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించేలా ఉంది. అందుకే ఈ చర్యను ఖండిస్తున్నాం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న తీవ్రవాద దాడులపై కూడా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ దాడులను ఖండిస్తున్నామని, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నామని చెప్పింది. రష్యా నుంచి భారత్ చాలా తక్కువ గ్యాస్ మాత్రమే దిగుమతి చేసుకుంటోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.