Police arrests Galwan martyr's father for 'illegally' constructing memorial
Bihar: రెండేళ్ల క్రితం చైనా బలగాలతో గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన జై కిషోర్ సింగ్ తండ్రిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కిషోర్ స్మారకం ఏర్పాటు చేయడమేనని పోలీసులు తెలిపారు. అరెస్టుకు ముందు ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, దూషిస్తూ ఇంట్లోంచి లాక్కెళ్లారని రాజ్‌కపూర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. అయితే, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారని, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఈ విషయమై సబ్ డివిజనల్ పోలీసు అధికారి స్పందిస్తూ ”జన్దాహాలో ప్రభుత్వానికి చెందిన స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై హరినాథ్ రామ్ అనే వ్యక్తిపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద జనవరి 23న కేసు నమోదైంది. కేసు నమోదు అయిన తర్వాత కూడా అక్కడ గోడలు లేపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఒకవేళ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని వారనుకుంటే సొంత భూమిలో ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. లేదంటే స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరవచ్చు. కానీ భూ ఆక్రమణ ద్వారా ల్యాండ్ ఓనర్ హక్కులను వాళ్లు ఉల్లంఘించారు” అని తెలిపారు.
Delhi Liquor Scam: సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ.. ఆయన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం
అయితే పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్‌పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఇంచార్జి తమ ఇంటికి వచ్చి తన తండ్రిని అరెస్టు చేశారని, అరెస్టుకు ముందు ఆయనను దూషిస్తూ, చేయి చేసుకున్నారని ఆయన తెలిపారు.