Delhi Liquor Scam: సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ.. ఆయన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం

సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్‭లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ఆయనకు సమన్లు పంపింది

Delhi Liquor Scam: సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ.. ఆయన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం

Supreme Court dismisses Sisodia's bail plea in Delhi liquor policy case

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే చట్టపరమైన పరిష్కారాలు సిసోడియాకు అందుబాటులో ఉన్నాయని, బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆయన మార్చి 4 వరకు కస్టడీలో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం సిసోడియా సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, తన కస్టడీని సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని, ఆయనపై నమోదైన కేసు వ్యక్తిగతంగా, వ్యవస్థపై దాడి చేయడమే అని సిసోడియా తరఫు న్యాయవాదులు అంటున్నారు.

Taliban vs ISIS: అఫ్ఘానిస్తాన్‭లో ఇద్దరు ఐసీస్ కమాండర్లను మట్టుబెట్టిన తాలిబన్లు

కాగా, సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్‭లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ఆయనకు సమన్లు పంపింది. సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. విచారణ సమయంలో సిసోడియా సమాధానాలు సంతృప్తికరంగా లేవని సీబీఐ అధికారులు తెలిపారు.

Attack On Bairi Naresh : పోలీసు వాహనంలో ఉండగానే బైరి నరేశ్‌పై దాడి.. తీవ్రంగా పరిగణించిన పోలీసులు

ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైనే సీబీఐ దర్యాప్తు జరుపుతోందని, సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లేదని సిసోడియా తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. సిసోడియా అరెస్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతలు, ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు.