Attack On Bairi Naresh : పోలీసు వాహనంలో ఉండగానే బైరి నరేశ్‌పై దాడి.. తీవ్రంగా పరిగణించిన పోలీసులు
Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. తెల్లవారుజామున జనగామలో దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేశారు. వారిని హనుమకొండ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. తెల్లవారుజామున జనగామలో దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేశారు. వారిని హనుమకొండ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
హేతువాది బైరి నరేశ్ పై నిన్న సాయంత్రం జరిగిన దాడిని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. లా కాలేజీ ఫెస్ట్ లో పాల్గొన్న బైరి నరేశ్ తిరిగి వెళ్తున్నాడు. ఇది గమనించిన హిందుత్వ వాదులు బైరి నరేశ్ పై దాడి చేశారు. దాడికి సంబంధించి బైరి నరేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు స్పందించారు. నరేశ్ ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అయినా ఆందోళనకారులు ఊరుకోలేదు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
పోలీసు వెహికల్ నుంచి బయటకు లాగి మరీ అతడిని చితక్కొట్టారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సుబేదారి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడికి పాల్పడ్డ వారిని జనగామలో అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉంచారని ప్రచారం జరిగింది. దీంతో హిందుత్వ వాదులు వచ్చి టాస్క్ ఫోర్స్ ఆఫీసును ముట్టడిస్తారని సమాచారం అందుకున్న పోలీసులు.. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దగ్గర భద్రతను పెంచారు. పోలీసులను మోహరించారు.
Also Read..Bairi Naresh : బైరి నరేశ్‌పై మరోసారి దాడి.. పోలీస్ వాహనంలో ఉండగానే చితక్కొట్టారు
భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు, ఓయూ స్టూడెంట్ బైరి నరేష్‌పై మళ్లీ దాడి జరగడం కలకలం రేపింది. హనుమకొండలో ఈ దాడి జరిగింది. బైరి నరేష్ బట్టలు విప్పి మరీ కొట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఓ యువకుడు ఏకంగా పోలీస్ వాహనంలోకి ఎక్కి మరీ.. బైరి నరేష్‌ను కొట్టాడు. పోలీసులు ఎంతగా నివారించేందుకు ప్రయత్నించినా.. నరేష్‌పై దాడిని ఆపలేకపోయారు.
హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు, హిందూవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. గతంలో అయ్యప్పపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లిన బైరి నరేష్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. బైరి నరేష్ మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతో.. దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పోలీస్ వెహికల్‌లో ప్రొటెక్షన్‌తో వెళ్తున్న బైరి నరేష్‌ను కిందికి లాగి బట్టలు ఊడదీసి దేహశుద్ధి చేయడం కలకలం రేపింది.
కేయూ లా కాలేజీలో ఫెస్ట్ కు హాజరై తిరిగి వస్తుండగా.. అంబేద్కర్ భవన్ సమీపంలో బైరి నరేశ్ పై దాడి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో ఎక్కించారు. అయినా, ఆందోళనకారులు తగ్గలేదు. పోలీస్ వెహికల్ లోకి దూరి మరీ బైరి నరేశ్ కు దేహశుద్ధి చేశారు.
గతంలో అయ్యప్ప స్వామిపై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేశ్. దాంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఆందోళనలు నిర్వహించారు. బైరి నరేశ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన నరేశ్ తిరిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. తనపై దాడి జరుగుతుందని ఎప్పుడో ఊహించినట్లు చెప్పాడు బైరి నరేశ్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ రక్షణ కల్పించాలని తాను కోరినట్లు వెల్లడించాడు. పోలీసు వాహనంలో ఉన్నప్పటికి కూడా తనపై దాడి జరిగిందని, భవిష్యత్ లో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి. అలాంటి అయ్యప్పస్వామిని చులకన చేస్తూ కారుకూతలు కూశాడని నాస్తికుడు బైరి నరేశ్ కు ఇప్పటికే అయ్యప్ప భక్తులు బుద్ది చెప్పారు. అయినా అతడిలో మార్పు రాలేదంటున్నారు. దాంతో మరోసారి అతనిపై అయ్యప్పలు దాడి చేశారు.