Bairi Naresh : బైరి నరేశ్‌పై మరోసారి దాడి.. పోలీస్ వాహనంలో ఉండగానే చితక్కొట్టారు

జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు. హన్మకొండ గోపాల్ పూర్ లో పోలీస్ వాహనంలో వెళ్తుండగా నరేశ్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు.(Bairi Naresh)

Bairi Naresh : బైరి నరేశ్‌పై మరోసారి దాడి.. పోలీస్ వాహనంలో ఉండగానే చితక్కొట్టారు

Bairi Naresh : గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలైన భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్ పై మరోసారి దాడి జరిగింది. జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు.

హన్మకొండ గోపాల్ పూర్ లో పోలీస్ వాహనంలో వెళ్తుండగా నరేశ్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ఆపి వాహనంలో ఉన్న నరేశ్ పై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు నిలవరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కేయూ లా కాలేజీలో ఫెస్ట్ హాజరై తిరిగి వస్తుండగా.. అంబేద్కర్ భవన్ సమీపంలో బైరి నరేశ్ పై దాడి జరిగింది.

Also Read..Bairi Naresh: కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశా.. బైరి నరేష్ అంగీకారం.. రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడి

గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేశ్. దాంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఆందోళనలు నిర్వహించారు. బైరి నరేశ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఈ మధ్య కాలంలోనే బెయిల్ పై బయటకు వచ్చిన నరేశ్ తిరిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తనపై దాడి జరుగుతుందని ఎప్పుడో ఊహించినట్లు చెప్పాడు బైరి నరేశ్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ రక్షణ కల్పించాలని తాను కోరినట్లు వెల్లడించాడు. పోలీసు వాహనంలో ఉన్నప్పటికి కూడా తనపై దాడి జరిగిందని, భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.(Bairi Naresh)

Also Read..Bairi Naresh : వెంటాడిన అయ్యప్ప భక్తులు, పరిగెత్తిన భైరి నరేశ్.. పరిగి జైలు దగ్గర ఉద్రిక్తత

కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి. అలాంటి అయ్యప్పస్వామిని చులకన చేస్తూ కారుకూతలు కూశాడని నాస్తికుడు బైరి నరేశ్ కు ఇప్పటికే అయ్యప్ప భక్తులు బుద్ది చెప్పారు. అయినా అతడిలో మార్పు రాలేదంటున్నారు. దాంతో మరోసారి అతనిపై అయ్యప్పలు దాడి చేశారు. హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలో నరేశ్ ను అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నేతలు కొట్టారు. పోలీస్ వెహికల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేశ్ ను భక్తులు కిందకు లాగి మరీ దాడి చేశారు.

Also Read..Bairi Naresh On Ayyappa : అగ్గి రాజేసిన బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తుల డిమాండ్

ఈ దాడిపై బైరి నరేశ్ స్పందించాడు. తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణను అడిగానని చెప్పాడు. పోలీసుల వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని అన్నాడు. పోలీసుల వాహనంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్ లైసెన్స్ కావాలని అతడు డిమాండ్ చేశాడు.