Police Case On Peete Usha : పీటీ ఉషపై పోలీస్ కేసు

పరుగుల రాణి పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విషయంలో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్, ఉషపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Police Case On Peete Usha

Police Case On Peete Usha : పరుగుల రాణి పీటీ ఉషపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ప్లాట్ విషయంలో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్, ఉషపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. పీటీ ఉష హామీ ఇవ్వడంతో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డ‌ర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 ల‌క్ష‌లు చెల్లించింది.

చదవండి : UP Police : కోట్ల రూపాయల లావాదేవీలు..కిడ్నాప్‌ కేసులో సాక్షిగా అంధుడి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు..!!

అయితే ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో సదరు బిల్డర్ జాప్యం చేస్తుండటంతో అనేక సార్లు ఉషకు విషయం చెప్పింది. ఈ వ్యవహారంపై ఆమె సరిగా స్పందించకపోవడంతో బిల్డర్ తోపాటు, పీటీ ఉషపై కోజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు బిల్డర్ తోపాటు, పీటీ ఉషపై 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక తనపై నమోదైన కేసు విషయంపై ఉష స్పంచలేదు.

చదవండి : Police Lathi Charge : నిరుద్యోగులపై లాఠీ జులిపించిన పోలీసులు