UP Police : కోట్ల రూపాయల లావాదేవీలు..కిడ్నాప్‌ కేసులో సాక్షిగా అంధుడి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు..!!

రూ. కోట్లు లావాదేవీలకు సంబంధించి..కిడ్నాప్‌ బెదిరింపుల కేసులో పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా ఓ అంధుడి రికార్డ్ చేసారు.

UP Police : కోట్ల రూపాయల లావాదేవీలు..కిడ్నాప్‌ కేసులో సాక్షిగా అంధుడి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు..!!

Up Police Basin People Statement

UP Police blind made a witness : చట్టానికి కళ్లు లేవు..చెవులతో వినే సాక్ష్యులు చెప్పే వివరాలను బట్టే తీర్పునిస్తుంది న్యాయస్థానం. అందుకేనేమో న్యాయదేవతకు కళ్లకు నల్లటి బట్ట కప్పి ఉంటుంది. న్యాయదేవత కళ్లకు నల్లటి బట్ల ఎందుకు కట్టి ఉంటుందనే విషయం పక్కనపెడితే..ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ ఘన కార్యం చేశారు. ఓ కిడ్నాప్ కేసులో అంధుడికి ప్రత్యక్ష సాక్షిగా తీసుకున్నారు.అతని స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇదికాస్తా..బయటకు రావడంతో పోలీసుల్ని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా గుడ్డివాళ్లైతే ఇక బాధితులకు న్యాయం ఏం జరుగుతుంది? అని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ మీరట్‌ జిల్లాలో శ్యామ్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి హాజీ ఆస్‌ మహ్మద్‌ అనే వ్యక్తిని డబ్బుల కోసం స్వయాని అతని బంధువులు మోసం చేశారు. హాజీ అన్సార్‌, అన్వర్‌లు అనే వ్యక్తులు హాజీ ఆస్ మహ్మద్ కు బంధువులు. మాంసం వ్యాపారం పేరుతో హాజీ ఆస్ నుంచి రూ.5.50 కోట్లు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు కానీ పని చేయలేదు. ఈ దీంతో హాజీ వారిని డబ్బులు తిరిగి ఇవ్వండి అంటూ అడిగాడు. కానీ వారు ఏవో సాకులు చెబుతున్నారు తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.

Read more : Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దంపతుల ప్రాణాలు తీశాడు

అలా మరోసారి మరోసారి అడిగాడు హాజీ. దీంతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని..హాజీ అన్సార్‌, అన్వర్‌లు నవంబర్ 26న హాజీపై దాడి చేసి.. కిడ్నాప్‌ చేస్తామని..ఆ తరువాత ఏం చేస్తామో తెలీదు అంటూ బెదిరించారు. ఈ దాడిలో హాజీ తలకు గాయమైంది. దాంతో హాజీ ఆస్‌ పోలీసులకు విషయం చెప్పి..హాజీ అన్సార్‌, అన్వర్‌ లతో పాటు మొత్తం ముగ్గురిపై ఫిర్యాడు చేశాడు.తనకు న్యాయం చేయమని కోరాడు. హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల మీద దాడి..కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more : No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB

ఈ కేసులో పోలీసులు ఏమాత్రం దృష్టిపెట్టలేదు. ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా నటించారు. దీంతో బాధితుడు హాజీ పదే పదే తన కేసు విషయం ఎంత వరకు వచ్చిందని పోలీసుల్ని అడగుతున్నాడు. దీంతో పోలీసులు ఏదో ఒకటి చెప్పాలి అనుకున్నారో ఏమోగానీ..ఈ కేసులో అబ్బాస్ అనే ఓ అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొంటు..అతడి స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులే అసలైన అంధులని మరోసారి నిరూపించారంటూ సెటైర్లు వేస్తున్నారు.ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. విచారణ కోసం ఆదేశించారు.