Police Dance : పోలీసుల సరదా.. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది..!

సరదా కోసం చేసిన పని ఆ పోలీసుల ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.. కారులో వెళ్తూ సరదగా పోలీసు డ్రెస్‌లో డ్యాన్స్ చేయడమే వారు చేసిన తప్పు.. వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Police Dance : సరదా కోసం చేసిన పని ఆ పోలీసుల ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.. కారులో వెళ్తూ సరదగా పోలీసు డ్రెస్‌లో డ్యాన్స్ చేయడమే వారు చేసిన తప్పు.. పైగా వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్తా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్యాన్స్ అందరూ చేయొచ్చు..  బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నవారికి కొన్ని పరిమితులు ఉంటాయి. అలాంటి సమయాల్లో అందరిలా ప్రవర్తిస్తే.. ఇలాంటి పర్యవసనలే ఎదురవుతాయి.

సస్పెండ్ కు గురైన పోలీసులు కారులో కూర్చొని ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. పోలీసు డ్రెస్‌లో రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఫలితంగా సస్పెండ్ కు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ లోని కచ్ జిల్లాలో జరిగింది. పోలీసుల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కారులో డ్యాన్స్ వేసిన పోలీసులు కనీసం ముఖానికి మాస్క్ ధరించలేదు.. కనీసం సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో పోలీసు యూనిఫాంలో డ్యాన్స్ వేసినందుకు వారిపై వేటుపడింది. ఆ ముగ్గురు పోలీసులు గాంధిధామ్ డివిజన్ పోలీసు స్టేషన్‌లోని పోలీసు కానిస్టేబుల్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ డ్యాన్స్ వీడియోను వారిలో ఒక పోలీసు రికార్డు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అదే వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చిపెట్టింది.

Read Also : Statue of Equality: ఫిబ్రవరి 5న సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు