police dragged woman
Police Dragged Woman By Hair : మధ్యప్రదేశ్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ రాష్ట్ర పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటు చేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను పోలీసులు జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. కట్నీ జిల్లా కౌరియాకు చెందిన చైనా బాయ్ కచి అనే మహిళ స్థలంలో అధికారులు విద్యుత్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు.
అయితే దానికి సంబంధించి ఆమెకు నష్టపరిహారం ఇవ్వకుండానే విద్యుత్ టవర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి టవర్ నిర్మాణం పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు జుట్టు పట్టి ఆమెను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనను అక్కడున్నవారు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Crime news: పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
అదికాస్త వైరల్ గా మారడంతో పోలీసు ఉన్నతధికారులు స్పందించారు. టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కేడియా పేర్కొన్నారు. చట్ట ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసింది పాత వీడియో అని పేర్కొన్నారు.
అయితే తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.