Police Arrest Wrestlers
wrestlers new parliament march : నూతన పార్లమెంట్ మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లు, రైతు సంఘం నేతలు, ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ భోగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ సహా రెజ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు మహిళా పంచాయత్ కి పిలుపిచ్చారు. నిరసన కార్యక్రమాలకు అనుమతి లేనందున రెజ్లర్లు, రైతు నేతలు, ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.