Punjab : భలే..భలే..త్వరలో ఎన్నికల ఫలితాలు..పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్..భారీగా ఆర్డర్ల వెల్లువ..

త్వరలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ఆర్డర్ల వెల్లువెత్తుతున్నాయి స్వీట్ల తయారీ సంస్థలకు.

Punjab Counting Of Votes Will Be Done On March 10th..ordering Laddoos

Punjab counting of votes will be done on March 10th..ordering laddoos : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిశాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఏపార్టీకి ఆ పార్టీయే నమ్మకం పెట్టుకున్నాయి. 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో పంజాబ్ లో లడ్డులకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. భారీగా లడ్డూల కోసం ఆర్డర్లు వెల్లువెత్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికల ఫలితాలకు ముందు లడ్డుల కోలాహల వాతావరణం నెలకొంది.

విజయం తమదేనని బలంగా నమ్ముతున్నఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఫలితాల తర్వాత విజయ సంబరాలకు ముందే సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. దీంతో స్వీట్ల తయారీదారులకు చేతి నిండా పని లభించింది. క్షణం తీరిక లేకుండా లడ్డూల తయారీలో సతమతమవుతున్నారు. భారీ సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు.

మామూలుగానే పంజాబీలు తీపి తినటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందులోనే లడ్డూలంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో గెలుపు తర్వాత సంబరాల్లో లడ్డూలను పంచిపెట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో తయారీ ఆర్డర్లు ఇచ్చారు. స్వీట్ హోమ్ లలో తయారీ ఫొటోలు చూస్తే వారెంత బిజీగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు.

ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)నే విజయం సాధిస్తుందని చెప్పడం తెలిసిందే. మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టుడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఒక్క ఏబీపీ-సీ ఓటర్ మాత్రం ఆప్ 57, కాంగ్రెస్ 26, అకాలీదళ్ 24, బీజేపీ 10 గెలుచుకుంటుందని చెప్పడం గమనార్హం. కానీ గెలుపు ఎవరిది అనేది ఫలితాల తరువాత క్లారిటీ రానుంది.