Pongal bonanza : రేషన్ కార్డు ఉన్న వారికి రూ. 2 వేల 500 విలువైన సరుకులు

Pongal Bonanza Announced : జనవరి మాసం వచ్చిందంటే..చాలు..సంక్రాంతి (Pongal) పండుగ గుర్తుకొస్తుంది. ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానుకలు ప్రకటిస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా..రూ. 2 వేల 500 విలువైన సరుకులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సీఎం ఈపీఎస్ పళని స్వామి (Chief Minister K Palaniswami) ఇరుప్పాలి (Irupali)లోని సేంద్రయ్య పెరుమాళ్ల కోయిల్ ఆలయంలో…పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

కొవిడ్ – 19, తుఫాన్ ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఈ క్రమంలో పొంగల్ (Pongal) సందర్భంగా కానుక ఇవ్వాలని భావించామన్నారు. జనవరి 04వ తేదీ నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా..రూ. 2500 చొప్పున ఇవ్వనున్నట్లు, దీంతో పాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరుకు గడ, 20 గ్రాముల కిస్ మిస్, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాముల యాలకులు ఉచితంగా అందివ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 2 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా. గృహాల వద్ద అధికారులు లబ్దిదారులకు టోకెన్లను జారీ చేస్తారని, ప్రకటించిన తేదీ నుంచి పంపిణీ కేంద్రాలకు వెళ్లి ఉత్పత్తులను పొందవచ్చన్నారు.

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మేయర్ Ma Subramanian వ్యతిరేకించారు. రూ. 2500 dole ఇస్తామనడం ఖండించదగిందని, రూ. 25 వేలు ఇచ్చినా..లక్ష్యాన్ని సాధించదన్నారు. రాష్ట్ర నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైందని విమర్శించారు. రేషన్ కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా 2014లో రూ. 100, కిలో బియ్యం, కిలో చక్కెర ఇచ్చామని, 2018లో ఆ మొత్తాన్ని రూ. 1000కి పెంచామని, అందులో భాగంగానే..ఇప్పుడు రూ. 2500 ఇస్తున్నామని సీఎం ఈపీఎస్ పళని స్వామి (K Palaniswami) తెలిపారు.