పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా

  • Publish Date - March 22, 2019 / 06:25 AM IST

దక్షిణాది సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రకాష్ రాజ్.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే కారణంతో కేసు నమోదు చేసింది. మరికొద్ది గంటల్లో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దపడుతున్న తరుణంలో.. ఈ కేసు నమోదు చేశారు అధికారులు.
Read Also : డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?

మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన మీడియా మరియూ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన బహిరంగ సభలో పొలిటికల్ కామెంట్లు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ స్పీచ్‌ను సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన కొంతమంది అధికారులకు చూపించగా.. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకే వస్తాయంటూ అధికారులు చెబుతున్నారు.

ఆ వీడియో ఆధారంగా అధికారు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్‌‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాష్‌రాజ్‌తో పాటు కార్యక్రమ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. కేసు బుక్ అయినా నామినేషన్ దాఖలు చేయవచ్చు.. అయితే నామినేషన్ పత్రాల్లో దాన్ని చూపించాలి. పోలీసులు ఏ సెక్షన్ కింద నమోదు చేశారు.. కేసు వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. దీని కోసం కొంత సమయం పడుతుంది. దీంతో ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
Read Also : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!