అంతేనా : ప్రకాష్ రాజ్ ఆస్తులు రూ. 31 కోట్లు

  • Publish Date - March 25, 2019 / 04:55 AM IST

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తులు..అప్పుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వీటిని అందులో పొందుపరచాలి. ప్రస్తుతం లోక్ సభ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ఇప్పటికే దాఖలు చేస్తున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు. బెంగళూరు సెంట్రల్ నుండి పార్లమెంట్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు.

ఈసీకి దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకున్న మొత్తం ఆస్తుల విలువ రూ. 31 కోట్లుగా వెల్లడించారు. రూ.26.59 కోట్ల స్థిరాస్థులు, రూ.4.93 కోట్ల చరాస్తులు.., పెట్టుబడుల రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని ప్రకాశ్ తెలిపారు. గత ఏడాది సమయంలో సినిమాల ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం, వివిధ బ్యాంకుల్లో రూ.25వేల నగదు ఉందన్నారు.

రూ.1.88 కోట్ల విలువ చేసే వాహనాలు, భార్య రష్మి వర్మ పేరిట రూ.20.46లక్షల చరాస్తి, రూ.35 లక్షల స్థిరాస్థి.. 18లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.