కాంగ్రెస్ పై ఈసీకి ప్రకాష్ రాజ్ కంప్లెయింట్

 కాంగ్రెస్ పార్టీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రముఖ సీనీ నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెంటెంట్ గా  పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌ తో ఉన్న  ఫొటోతో.. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్‌ రాజ్ కంప్లెయింట్ లో తెలిపారు.

రిజ్వాన్ పీఏ మజహర్ అహ్మద్ ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నాడని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.ఓ డిబేట్ లో కాంగ్రెస్ నాయకుడు రిజ్వాన్ తో తాను చేతులు కలిపిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…ప్రకాశ్ రాజ్‌ కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి మీరు మీ ఓటును వృథా చేసుకోవద్దని షేక్ న్యూస్ షేర్ చేస్తున్నారని, తనకు వేసే ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఈసీకి తెలియజేశారు.ప్రకాశ్ రాజ్ కంప్లెయింట్ ను స్వీకరించిన ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.