Pralay Missile Testfire : 24 గంటల వ్యవధిలో రెండో మిస్సైల్ పరీక్ష విజయవంతం..

ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లంలోని ల‌క్ష్యాల‌ను చేధించే సామ‌ర్థ్యం క‌లిగిన‌ బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌ళ‌య్‌ని భార‌త్ వ‌రుస‌గా రెండో రోజూ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.

Pralay Missile Testfire : భారత్ మరో మిస్సైల్ పరీక్షలో విజయం సాధించింది. ఉపరితలం నుంచి ఉప‌రిత‌లంలో ల‌క్ష్యాల‌ను చేధించే సామ‌ర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌ళ‌య్‌ (Pralay Missile)ని వ‌రుస‌గా రెండో రోజూ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది భారత్. మొదటి రోజు మిస్సైల్ పరీక్షలో విజయం సాధించిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే మరో మిస్సైల్ ప‌రీక్ష సక్సెస్ అయింది. ఈ మేరకు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (DRDO) అధికారులు అధికారికంగా ప్రకటించారు. డెవలప్ మెంట్ స్టేజీలో ఉన్న మిస్సైల్  వరుసగా రెండు రోజులు విజ‌య‌వంతంగా ప‌రీక్షించ‌డం ఇదే తొలిసారిగా డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు.

భారత్ ఈ క్షిపణిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇండియ‌న్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన‌ పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణి (Pralay Missile)ని రూపొందించారు. 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ప్రళయ్ క్షిపణి సులభంగా చేధించగలదు. అలాగే 500 కిలోల నుంచి 1000 కిలోల బరువును కూడా సులభంగా మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణి ఘన ఇంధ‌నంతో పనిచేస్తుందని తెలిపారు. క్షిప‌ణి ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన డీఆర్‌డీవో బృందాన్ని ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

అంతకుముందు మొదటిరోజున దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్‌’ని బుధవారం డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 10.30 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. ప్రళయ్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించారు.

ప్రళయ్‌లోని సాంకేతిక వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైన లక్ష్యాన్నిఛేదించే కొత్తతరం కిపణిగా తెలిపింది. సాయుధ బలగాలకు ఈ క్షిపణి ద్వారా మరింత శక్తినిస్తుందని డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.


Also Read : Pralay Missile : షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ “ప్రళయ్”ప్రయోగం విజయవంతం

ట్రెండింగ్ వార్తలు