మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

  • Publish Date - August 31, 2020 / 06:00 PM IST

Pranab Mukherjee, former President of India, dies at 84: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. 84ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఆయన ఆరోగ్యాన్ని కుంగదీయగా కాసేపటి క్రితం చనిపోయారు.

ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుంచి ప్రకటన వచ్చింది. ‘నిన్నటి నుంచి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించగా ఈ రోజు(31 ఆగస్ట్ 2020) ఆయన చనిపోయారు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన ‘సెప్టిక్‌ షాక్‌’లోకి వెళ్లిన ఆయన.. డీప్‌ కోమాలో ఉండి చనిపోయారు.

ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ మేరకు సమాచారం అందించారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడుగా ఉండి రాష్ట్రపతిగా సేవలు అందించిన ప్రణబ్.. కరోనావైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరగా.. అతని మెదడులో రక్తం గడ్డకట్టింది.

ప్రణబ్ 2012 నుండి 2017 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. 2009 మరియు 2012 మధ్య ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి (2004-2006), విదేశాంగ మంత్రి (2006-2009) గా పనిచేశారు. ప్రణబ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. షర్మిస్తా ముఖర్జీ, అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ.

ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్‌లో బలమైన నాయకునిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీకి 2008 లో పద్మ విభూషణ్, 2019లో భారత్ రత్న అందుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు