వెంటిలెటర్ పై ప్రణబ్ ముఖర్జీ!..బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్

  • Publish Date - August 11, 2020 / 11:01 AM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో శస్త్ర చికిత్స జరిగిందని, విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రి వర్గాలు సోమవారం రాత్రి వెల్లడించాయి.



ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నట్లు సమాచారం.
ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ప్రణబ్…కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్న 2020, ఆగస్టు 10వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫర్ హాస్పిటల్ లో చేరారు.



పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణబ్ సూచించారు.