Prashant Kishor: కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్స్!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. లఖింపూర్ ఘటనతో ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.

అయితే, దురదృష్టవశాత్తు, కాంగ్రెస్‌లోని లోతైన సమస్యలకు తక్షణ పరిష్కారం లేదని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని GOP అనగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని పిలిచారు.

కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ మీదనే విమర్శలు చేయడం ఆసక్తికరం. 2014లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా చేసిన ప్రశాంత్ కిషోర్.. తర్వాత అనేక రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు.

ప్రశాంత్ కిషోర్ మొదట 2014 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీతో కలిసి పనిచేశారు. తరువాత జేడీయూలో చేరారు. పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి సహాయం చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా కూడా ఉన్నారు.

ఇవే కాకుండా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు