ట్వీట్ కలకలం : శివసేనతో ప్రశాంత్ కిషోర్ ?

  • Publish Date - March 31, 2019 / 01:55 AM IST

నేను పని చేయడానికి వచ్చా…పోటీ కోసం కాదు ఈ పంచ్ డైలాగ్ ప్రస్తుతం బీహార్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలలో ఎలా గెలవాలనే అంశంపై సూచనలు ఇవ్వడంపై ఎక్స్‌పర్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కి పేరుంది. గత ఏడాది ఆయన నితీష్ కుమార్‌ గూట్లో చేరిపోయారు. జనతాదళ్ యునైటెడ్  పార్టీలో నంబర్ టూ పొజిషన్ కూడా దక్కించుకున్నారు. దీంతో ఆయన ఈ 2019 ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తారని భావించారు. కానీ ఆయనకి అంతగా గుర్తింపు దక్కకపోవడంతో బాగా హర్ట్ అయ్యారని అంటున్నారు. పీకే చెప్పినవారికి టిక్కెట్లు ఇవ్వకపోవడం..పలు విషయాల్లో ఆయనని నితీష్ పక్కనబెట్టారనే గుసగుసలు విన్పించాయ్.

ఈ తరుణంలో పీకే ట్వీట్ విడుదలైంది. జేడీయూ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేయడంతో..కలకలం రేగింది. తాను నేర్చుకోవడానికి..సహకరించడానికే పరిమితమవుతున్నట్లుగా ట్వీట్ చేశారాయన. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి నుండి ఎన్నికల వ్యూహకర్తగా మంచి సంపాదించుకున్నారు. ఆ తర్వాత యూపీలో అఖిలేష్ యాదవ్‌కి..పంజాబ్‌లో కాంగ్రెస్‌కి మార్గదర్శకత్వం వహించారు.

ఆ తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సమయంలోనే జేడీయూలో చేరారు..ఇప్పుడీ ఎన్నికలు ముగిసిన తర్వాత పీకే శివసేనకు కాంట్రాక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో నితీష్ కుమార్ యూపిఏ నుంచి ఎన్డీఏకి మారిన సమయంలో పీకే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందిగా సూచించారట. అక్కడ్నుంచే పీకేపై నితీష్ నమ్మకం పోగొట్టుకున్నట్లు చెప్తారు. పీకేకి పెద్దగా రాజకీయానుభవం లేదని కూడా జనవరిలో నితీష్ కామెంట్ చేయడం గమనార్హం. 

ట్రెండింగ్ వార్తలు