PK Tweet On Nitish: మోదీ, నితీశ్ కలిసున్న 4 ఫొటోలు ట్వీట్ చేసి వెంటనే డిలీల్ చేసిన ప్రశాంత్ కిశోర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి టెక్స్ట్ ఏమీ రాయకపోయినప్పటికీ పీకే ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.

PK Tweet On Nitish: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ఒక ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైఖరిని ఎద్దేవా చేస్తున్నట్లు ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్ పలు సందర్భాల్లో కలిసి నాలుగు ఫొటోలను తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ ట్వీట్‭లో టెక్స్ట్ ఏమీ రాయలేదు. పీకే చేసిన ఆ ట్వీట్‭కు 500 లైకులు, 66 రీట్వీట్లు, 28 కోట్ ట్వీట్లు వచ్చాయి. అయితే కొద్ది సమయానికే ఈ ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం.

నితీశ్ నేతృత్వంలోని జనతా దళ్ యూనియన్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిశోర్ కొంత కాలం పని చేశారు. అనంతరం బీజేపీతో జేడీయూ సీట్ల పంపకంలో నితీశ్‭తో మాటా మాటా పెరిగి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా నితీశ్‭పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక తాజా ట్వీట్ సైతం విమర్శనాకత్మకంగానే ఉంది.

Joe Biden Administration: నాలుగేళ్లలో తొలిసారి.. పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు .. ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వం

Prashant Kishor takes a dig at Nitish Kumar with 4photo tweet then deleted

ఈ ట్వీట్‭కు కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ‘‘ఒక నెల క్రితం నితీశ్ పక్షంలో(అధికార పార్టీతో కలిసి) ఉన్నారు. ఇప్పుడు సడెన్‭గా విపక్షంలోకి మారిపోయారు. ఇదేమైనా ప్రజలు నిర్ణయించిందా? ఏ ప్రాతిపదిక మీద ప్రభుత్వం మారిపోయిందనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం దేశంపై ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు. కానీ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడికి మాత్రం సాధ్యం కావచ్చు (అది ప్రతికూలంగా అయినా, అనుకూలంగా అయినా). కానీ దేశంలోని పక్షాలను ఏకం చేసే ఆసక్తి ఉండడంలో తప్పు లేదు. అలా అని చేయలేరు అని కాదు. ఎవరైనా ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు’’ అని అన్నారు.

ఇక తాజా ట్వీట్‭ ఆ మాటల్ని ఊటంకిస్తూ నితీశ్ ను ఎద్దేవా చేస్తున్నట్లే ఉంది. ఈ ట్వీట్‭లో షేర్ చేసిన ఫొటోల్లో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి టెక్స్ట్ ఏమీ రాయకపోయినప్పటికీ పీకే ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.

Donald Trump: ఇండియాకు నేనే మంచి స్నేహితుడిని.. మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

ట్రెండింగ్ వార్తలు