Joe Biden Administration: నాలుగేళ్లలో తొలిసారి.. పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు .. ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వం

పాకిస్థాన్‌కు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

Joe Biden Administration: నాలుగేళ్లలో తొలిసారి.. పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు .. ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వం

joe biden

Joe Biden Administration: పాకిస్థాన్‌కు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్ -16 పైటర్ జెట్లను అందించనుంది. అయితే గత నాలుగేళ్లుగా అమెరికా పాకిస్థాన్ కు భద్రతాసాయం అందించలేదు. నాలుగేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

PAK vs AFG Match: అఫ్గాన్ బౌలర్‌ను కొట్టేందుకు బ్యాట్ పైకెత్తిన పాక్ క్రికెటర్.. బౌలర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్ ..

450 బిలియన్ల డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్ -16 యుద్ధ విమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాకిస్థాన్ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హాని ఏర్పడదని చెప్పింది.

Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ భాగస్వామి కాదని పేర్కొంటూ 2018లో పాకిస్థాన్‌కు అన్ని రక్షణ, భద్రతా సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటి నుంచి పాకిస్తాన్‌కు ఇది మొదటి ప్రధాన భద్రతా సహాయం. పాకిస్తాన్ కు ఈ సహాయంతో యునైటెడ్ స్టేట్స్ – పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యమైన భాగం. ఎఫ్-16 నౌకాదళం పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు ఉపయోగిస్తుందని, పాకిస్తాన్ అన్ని ఉగ్రవాద గ్రూపులపై నిరంతర చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని అమెరికా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.