PAK vs AFG Match: అఫ్గాన్ బౌలర్‌ను కొట్టేందుకు బ్యాట్ పైకెత్తిన పాక్ క్రికెటర్.. బౌలర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్ ..

ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు తలపడ్డాయి.

PAK vs AFG Match: అఫ్గాన్ బౌలర్‌ను కొట్టేందుకు బ్యాట్ పైకెత్తిన పాక్ క్రికెటర్.. బౌలర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్ ..

pakistan vs afghanistan

PAK vs AFG Match: ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు అఫ్గాన్ బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. చివరికి లాస్ట్ ఓవర్ లో తొమ్మిది వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ విజయాన్ని అందుకుంది. పాక్ విజయం సాధించగానే స్టేడియంలోని అఫ్గాన్ అభిమానులు రెచ్చిపోయారు. దీంతో పాక్, అఫ్గాన్ అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు.

PAK vs AFG Match: స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్న పాక్, అఫ్గానిస్థాన్ అభిమానులు .. వీడియో వైరల్

పాక్ వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ ప్రారంభం నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగింది. గ్రౌండ్‌లో ఇరుజట్ల ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ, అఫ్గాన్ క్రికెటర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ మధ్య ఓ చిన్నస్థాయి యుద్ధమే కొనసాగింది. ఫరీద్ అహ్మద్ మాలిక్‌ వేసిన బంతికి ఆసిఫ్ అలీ సిక్స్ కొట్టాడు. అయితే అనంతరం వేసిన బాల్ కు అవుట్ అయ్యాడు. ఆసిఫ్ అలీ ఔట్ కావడంతో బౌలర్ అహ్మద్ వేగంగా ఆసిఫ్ వైపుకు దూసుకొచ్చి పిడికిలి బిగించాడు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసిఫ్ బ్యాట్ ను చూపించాడు. దీంతో అఫ్గాన్ బౌలర్ ఆసిఫ్ మీదకు మరోసారి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆసిఫ్ బ్యాట్ తో కొట్టేందుకు సిద్ధమవ్వగా పక్కనే ఉన్న ప్లేయర్లు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఆసక్తికర కామెంట్ల చేస్తున్నారు. పాక్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆసిఫ్ ను వెంటనే క్రికెట్ నుంచి తొలగించాలని ఐసీపీని కోరుతూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇలా పాక్ కు అనుకూలంగా కొందరు అఫ్గాన్ కు అనుకూలంగా కొందరు ట్వీట్లు చేస్తు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే ఈ వీడియోపై పాక్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ స్పందించారు.