Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

పాకిస్తాన్‌లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.

Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

Pakistan floods: పాకిస్తాన్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో వరదల్ని ఆ దేశం ఎదుర్కుంటోంది. ఈ వరదల ప్రభావంతో ఇటీవలి కాలంలో 1,290 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

12,500 మంది వరకు గాయపడ్టట్లు తెలిపింది. పాకిస్తాన్‌లో వరద బీభత్సంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన గణాంకాలివి. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో వరద ప్రభావం అత్యధికంగా ఉంది. 22 కోట్లకుపైగా జనాభా ఉన్న ఆ దేశంలో దాదాపు 3.3 కోట్ల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. అందులో దాదాపు 64 లక్షల మందికి అత్యవసర మానవతా సాయం అవసరం ఉంది. 6.3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితుల్లో చాలా మందికి వైద్య సాయం కూడా అందించలేని స్థితిలో పాక్ ఉంది. అనేక ప్రాంతాలు నీట మునగడం వల్ల 4,332 వరకు ఆస్పత్రులు పూర్తిగా పనిచేయలేని స్థితిలో ఉన్నాయి. మిగతా 1,028 ఆస్పత్రులు మాత్రం పాక్షికంగానే సేవలందిస్తున్నాయి.

Drug Tablets : విశాఖలో మత్తు ట్యాబ్లెట్ల కలకలం.. ఏకంగా 8వేల ట్యాబ్లెట్లు స్వాధీనం

ప్రస్తుతం అక్కడ వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే. ఔషధాలు, వైద్య సామగ్రి, వైద్య సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. పలు ప్రాంతాలు వరద నీటిలో మునగడం వల్ల తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. దీంతో వరద ప్రభావిత ఏరియాల్లో డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇతర జబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. కాగా, ప్రస్తుత విపత్తు నుంచి పాకిస్తాన్‌ను రక్షించేందుకు వీలైనంత సాయం అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు తెలిపారు.