Drug Tablets : విశాఖలో మత్తు ట్యాబ్లెట్ల కలకలం.. ఏకంగా 8వేల ట్యాబ్లెట్లు స్వాధీనం

విశాఖలో కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Drug Tablets : విశాఖలో మత్తు ట్యాబ్లెట్ల కలకలం.. ఏకంగా 8వేల ట్యాబ్లెట్లు స్వాధీనం

Drug Tablets : విశాఖలో కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. కాగా, ఈ మత్తు ట్యాబ్లెట్లను ఎవరికి విక్రయిస్తున్నారన్న దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇటీవలి కాలంలో విశాఖలో డ్రగ్స్ వినియోగం, మత్తు బిళ్లల వినియోగం పెరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. యాంటీ నార్కోటిక్స్ సెల్ ను ప్రారంభించారు. మత్తు పదార్ధాల వినియోగం, రవాణ గురించి సమాచారం అందిన వెంటనే టాస్క్ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఆ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

ఈ క్రమంలో గంజాయి సేవిస్తున్న పాయింట్లలో, విక్రయిస్తున్న పాయింట్లలో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వల పన్ని నిందితులను పట్టుకుంటున్నారు. మత్తు పదార్దాలన్నీ గోవా నుంచి వయా హైదరాబాద్ టు విశాఖపట్నం మీదుగా సరఫరా అవుతున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. పలు సందర్భాల్లో గోవాలో డ్రగ్స్ అమ్మకందార్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా, ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. విశాఖలో డ్రగ్స్ పెడ్లర్స్ పై పోలీసులు నిఘా పెట్టారు.

గంజాయి, డ్రగ్స్ నివారణకు పోలీసులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ చాప కింద నీరులా మత్తు పదార్దాలు విశాఖ నగరంలో విస్తరిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేయడం, దాన్ని తీసుకెళ్లి గోవా లాంటి ప్రాంతాల్లో ఎక్స్ చేంజ్ రూపంలో అంటే వారికి గంజాయి ఇచ్చి మత్తు బిళ్లల రూపంలో కొనుగోలు చేసి విశాఖకు తీసుకొస్తున్నారు. తొలుత సరదాగా వీటిని వినియోగిస్తారు. ఆ తర్వాత వారే అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.