BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

BiggBoss6 first day task geethu fight with Inaya sulthana

Updated On : September 6, 2022 / 6:58 AM IST

BiggBoss6 :  ఎట్టకేలకు గ్రాండ్ గా ఆదివారం సాయంత్రం బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలైంది. ఈ బిగ్‌బాస్ 6వ సీజన్ లో ఏకంగా 21 మందితో హౌస్ ని నింపేశారు. వచ్చిన కంటెస్టెంట్స్ కి అప్పుడే సపోర్ట్ గా సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టేశారు. మొదటి రోజు నుంచే హౌస్ లో ఆట మొదలైపోయింది.

మొదటి రోజు ఉదయం గార్డెన్‌లో కంటెస్టెంట్లు అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఈ సమయంలో అంతా సరదాగా ఉండి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. బాత్‌రూమ్‌లో వెంట్రుకలు పడ్డాయని గీతూ రాయల్‌ హాల్లోకి వచ్చి అందరిముందు అరిసింది. ఎవరి పని వాళ్లు చేయాలనే రూల్‌ ఉన్నా వేరే వాళ్ల వెంట్రుకలు మాత్రం నేను తీయను అని అరిచింది గీతూ. ఇంతలో వెనుకైనా నుంచి ఒక కంటెస్టెంట్ ఆ వెంట్రుకలు ఇనయా సుల్తానావి అని చెప్పడంతో గీతూ, సుల్తానా మధ్య కాసేపు ఈ జుట్టు పంచాయితీ నడిచింది. వీళ్ళిద్దరూ అరుచుకుంటూ ఉంటే మిగిలిన వాళ్లంతా సైలెంట్ గా వీళ్ళనే చూస్తూ ఉన్నారు.

CPI Narayana On Bigg Boss Show : రియాల్టీ షో కాదు బూతు షో.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్, బ్యాన్ చేయాలని డిమాండ్

ఇక ఆ తర్వాత మొదటి రోజు నుంచే టాస్కులు ఉంటాయని బిగ్‌బాస్ ఇచ్చిన ఫైల్ ని ఫైమా అందరికి చదివి వినిపించింది. ఇందులో హౌజ్‌లోని సభ్యులను క్లాస్‌, ట్రాష్‌, మాస్ అంటూ భాగాలుగా విడిపోవాలి. ఎవరు క్లాస్‌, ఎవరు ట్రాష్‌, మాస్ అనేది వాళ్లే తేల్చుకోవాలి. క్లాస్‌ సెక్షన్‌ వాళ్లు సకల సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్‌ వాళ్లు బయట గార్డెన్‌ ఏరియాలో వంట చేసుకోవాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో అందరూ డివైడ్ అయ్యారు. అనంతరం ఇద్దరు కంటెస్టెంట్లు కొబ్బరి బోండాలోని నీళ్లు కింద పడకుండా ఒకరినొకరు కొట్టుకోవాలని టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బోండంలో ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్లే విన్నర్ అని చెప్పారు. ఇందులో ఆదిరెడ్డి, ఇనయా ఆడగా ఆదిరెడ్డి విన్నర్‌ అయ్యారు. ఈ సారి మొదటి రోజు నుంచే ఇలా ఫుల్ హీట్ తో ఆట మొదలుపెట్టారు కంటెస్టెంట్స్.