CPI Narayana On Bigg Boss Show : రియాల్టీ షో కాదు బూతు షో.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్, బ్యాన్ చేయాలని డిమాండ్

బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్న నారాయణ.. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

CPI Narayana On Bigg Boss Show : రియాల్టీ షో కాదు బూతు షో.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్, బ్యాన్ చేయాలని డిమాండ్

Updated On : September 5, 2022 / 8:31 PM IST

CPI Narayana On Bigg Boss Show : బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్న నారాయణ.. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు బిగ్ బిస్ షో తో యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

వింత జంతువులు హౌస్ లోకి వచ్చారు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంద రోజులు స్వచ్చందంగా షో లో పాల్గొన్నామని చెబితే ఎవరు నమ్ముతారు అని నారాయణ అన్నారు. వెంటనే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు నారాయణ. గతంలోనూ బిగ్ బాస్ షోపై నారాయణ తీవ్ర విమర్శలు చేశారు.

”నా దృష్టిలో బిగ్ బాస్ అనేది సమాజానికి శత్రువే. దాంతో సమాజానికి ఎలాంటి ఉపయోగమూ లేదు. ముక్కు మొహం తెలియని వాళ్లంతా వస్తారు. దాదాపు 100 రోజుల పాటు పెద్ద భవంతిలో పారేస్తారు. ఇందులో కల్చర్ నేర్చుకోండి అని చెప్పడం దారుణం. కోట్లాది మంది యువత శక్తిని ఈ షో నిర్వీర్యం చేస్తోంది. చెడు సంకేతాలు పంపిస్తున్నారు. సామాజిక రుగ్మత ఇది. దరిద్రపు షో తప్ప రియాల్టీ షో కానే కాదు. రియాల్టీ బూతు షో” అని నిప్పులు చెరిగారు నారాయణ.

కాగా.. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్-‌6 అట్టహాసంగా ప్రారంభమైంది. మూడో సీజన్‌ నుంచి హోస్ట్‌గా అలరిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి మరింత ఎనర్జిటిక్‌గా ముందుకొచ్చారు.