Covid Vaccine : వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఆసుపత్రిలో చేరే అవసరం తగ్గుతుంది-ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్

కోవిడ్ వ్యాక్సిన్‌కు బూస్టర్ డోస్ తీసుకోవటంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పందించారు.

Covid Vaccine :  కోవిడ్ వ్యాక్సిన్‌కు బూస్టర్ డోస్ తీసుకోవటంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పందించారు. వయోధికులు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు, కీమోథెరపీ చేయించుకుంటున్నవారు, శ్వాసకోశ వ్యాధులున్న వారు తీవ్రమైన ఇబ్బందుల్లో పడకుండా మూడో  డోస్ దోహదపడుతుందని ఆయన చెప్పారు. కరోనా టీకా తీసుకోవడం వల్ల లభించే రోగ నిరోధక శక్తి తొమ్మిది నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

కరోనా బారిన పడిన వారిలో రోగనిరోధకత కూడా దాదాపు 9 నెలల సమయం ఉంటుందని ఆయన అన్నారు. టీకాలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్‌ బారిన పడడంలో ఏదో ఒకటి మాత్రమే జరిగిన వారితో పోలిస్తే ఆ రెండూ జరిగిన వారిలో రోగనిరోధక స్పందన ఎక్కువని తెలిపారు.

Also Read : Vijayawada Book Festival : రేపటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

కరోనా వైరస్‌లో రకాలు గతంలో శ్వాసనాళాల ద్వారా ఎలా వ్యాప్తి చెందాయో ఇప్పుడూ అలాగే వస్తున్నాయని అన్నారు. కోవిడ్ చికిత్సకు మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని.. ముందస్తు డోసుతో తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ప్రాణాపాయం తగ్గుతుందని ఆయన వివరించారు. డెల్టా రకం కంటే ఒమిక్రాన్‌ 3-4 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది కనుక  టీకా తీసుకున్నా…. తీసుకోకపోయినా ప్రజలు ఎల్లప్పుడూ మాస్కులు ధరించడం తప్పని సరి అని ఆయన చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు