Premarital Background Check: పెళ్లికి ముందే డిటెక్టివ్‌లతో నిఘా.. రహస్య ప్రేమలు, పెళ్లిళ్లపై ఆరా.. పెరుగుతున్న ప్రీమారిటల్ చెకప్స్

వివాహానికి ముందు భాగస్వామి గురించి ముందస్తు విచారణ (Premarital Background Check) జరిపించే సంస్కృతి వేగంగా పెరుగుతోంది.

Premarital background checks trend increasing in india day by day

  • పెళ్లికి ముందే డిటెక్టివ్‌ల నిఘా
  • రహస్య ప్రేమాయణాలు అప్పులు అవుట్
  • డేటింగ్ యాప్‌ల పరిచయాలపై హెచ్చరిక

Premarital Background Check: ఇటీవలి కాలంలో జరుగుతున్న పలు దిగ్భ్రాంతికర సంఘటనల నేపథ్యంలో వివాహానికి ముందు భాగస్వామి గురించి ముందస్తు విచారణ (Premarital Background Check) జరిపించే సంస్కృతి వేగంగా పెరుగుతోంది. లోహగడ్ కోట సమీపంలోని ‘సియా పాయింట్’ వద్ద కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను ప్రియురాలే నెట్టి చంపిన ఘటన, ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య వంటి కేసుల తర్వాత దేశవ్యాప్తంగా చాలా కుటుంబాలు అప్రమత్తమయ్యాయి. కేవలం జాతకాలు మ్యాచ్ అవ్వడం, ఉద్యోగాలు చూడడమే కాకుండా.. వ్యక్తిగత విషయాలు, పాత బంధాల గురించిన వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రైవేట్ డిటెక్టివ్‌లను సైతం ఆశ్రయిస్తున్నారు.

MEA Shocking Report: విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఒత్తిడి.. మూడేళ్లలో 100 మంది మృతి.. డాలర్ డ్రీమ్స్ కిల్ అవుతున్నాయా?

మ్యాట్రిమోనియల్ యాప్స్ & రకరకాల అనుమానాలు:

సాంప్రదాయక వివాహాల్లో తెలిసిన బంధువుల ద్వారా సంబంధాలు వచ్చేవి, కానీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, డేటింగ్ యాప్‌ల వల్ల పరిచయం లేని వ్యక్తులు కలుస్తున్నారు. దీంతో కాబోయే వధూవరుల ఉద్యోగం, జీతం, ఆర్థిక అప్పులు, క్రిమినల్ రికార్డులు, స్నేహితుల సర్కిల్‌తో పాటు వారి అలవాట్లు సరిచూసుకుంటున్నారు. కొన్ని కుటుంబాలైతే గతంలో ఉన్న ప్రేమ వ్యవహారాలు, రహస్య పెళ్లిళ్లు, చివరకు కాల్ డేటా రికార్డుల కోసం కూడా డిటెక్టివ్‌లను అడుగుతుండటం విశేషం.

చట్టపరమైన పరిమితులు & డిటెక్టివ్‌ల సరిహద్దులు:

ముందస్తు తనిఖీలు చేసుకోవడం చట్టరీత్యా నేరం కానప్పటికీ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ రికార్డులు తనిఖీ చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ, అనుమతి లేకుండా ప్రైవేట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వివరాలు సేకరించడం లేదా నిరంతరం ఒకరిని ఫాలో అవ్వడం నేరమవుతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి, లాయర్ వై.పి. సింగ్ హెచ్చరిస్తున్నారు.