Premier Padmini : ఆరు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు.. ముంబయి రోడ్లపై నిలిచిపోనున్న ‘ప్రీమియర్ పద్మినీ’ టాక్సీలు

50 సంవత్సరాలుగా ఆ టాక్సీలు అక్కడి రోడ్లపై పరుగులు పెట్టాయి. కాల పరిమితి తీరడంతో ఇక అవి కనుమరుగవుతున్నాయి. ఏ టాక్సీలు..ఎక్కడ? చదవండి.

Premier Padmini

Premier Padmini : ముంబయి వీధుల్లో ఇకపై ‘ప్రీమియర్ పద్మిని’ టాక్సీలు కనిపించవు. ఇటీవలే డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను తొలగించిన వెంటనే నలుపు-పసుపు రంగులో ఉండే ఈ ట్యాక్సీలు కూడా వీడ్కోలు తీసుకుంటున్నాయి.

Anand Mahindra : ముంబయిలో డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ముంబయికి చెందిన ప్రీమియర్ పద్మిని టాక్సీలు అక్టోబర్ 30 నుంచి సిటీలో తిరగవు. 20 ఏళ్లు దాటిన పాత క్యాబ్‌లను సిటీలో నడపడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రీమియర్ పద్మిని శకం ముగిసింది. ఈ విషయం ముంబయి ప్రజల మనసు బరువెక్కించింది. కొందరు కనీసం ‘ప్రీమియర్ పద్మిని’ని రోడ్డుపై లేదా మ్యూజియంలో భద్రపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రీమియర్ పద్మినీ టాక్సీలు ముంబయి గోడలపై మాత్రమే కనిపిస్తాయని.. మెల్లమెల్లగా కనుమరుగైనప్పటికీ తమ హృదయాల్లో వాటి స్ధానం పదిలంగా ఉంటుందని  అక్కడి ప్రజలు అంటున్నారు.

Security Alert : ముంబయి ఆకాసా విమానానికి భద్రత హెచ్చరిక..సెక్యూరిటీ అలర్ట్

ప్రస్తుతం ముంబయి సిటీలో ట్యాక్సీలుగా రకరకాల కార్ మోడళ్లు తిరుగుతున్నాయి. అయితే టాక్సీకి పెయింటింగ్ విషయానికి వస్తే దాదాపు ఐదు దశాబ్దాల పాటు ముంబయి వీధులను పాలించిన నలుపు, మరియు పసుపు ప్రీమియర్ పద్మిని మాత్రమే మనసులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవి 40,000 వరకు క్యాబ్‌లు ఉన్నాయి. 90 ల చివర్లలో దాదాపు 90,000 వరకు ఉండేవి.