JIO నెట్‌వర్క్ అద్భుత ప్లాన్‌లు.. ఉచితంగా 12వేల టాక్ టైం

రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. గతేడాది తీసుకొచ్చిన (ఐయూసీ) ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీల్లో కస్టమర్లకు మరింత బెనెఫిట్ అందేలా చూసింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసేందుకు 12000 నిమిషాల టాక్ టైంను అందించనుంది. ఇవి పూర్తయ్యాక ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ మాట్లాడాలంటే 6 పైసల ఐయూసీ చార్జీలు అదనంగా వసూలు చేయనుంది జియో.
కొత్త స్కీంల ప్రకారం.. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. 2వేల 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం.. వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే. ఇతర నెట్ వర్క్‌లకు కాల్స్ చేసేందుకు 12వేల నిమిషాల టాక్ టైం అందుతుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు 10జీబీ డేటా బోనస్ అదనం. సంవత్సరానికి మొత్తం 740 జీబీ డేటాను వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు. అలాగే డిస్నీ + హాట్‌స్టార్ వార్షిక ఉచిత చందా.
2వేల 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇదీ వార్షిక చందానే. నాన్-జియో ఎఫ్‌యూపీ 12వేల నిమిషాలు. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు. ఈ ప్లాన్‌లో 10జీబీ అదనపు డేటాను లేదా డిస్నీ + హాట్‌స్టార్‌కు సభ్యత్వం లభించదు.
2వేల 121 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: 336 రోజుల వాటిడిటీ, నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాల టాక్ టైం. రోజుకు 1.5 జీబీ డేటా, ఎస్‌ఎంఎస్‌లు లభ్యం.
1299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ కూడా 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు
4వేల 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 12వేల నిమిషాల టాక్ టైం అందిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు.
Read:UPSC పరీక్షా కేంద్రాలు మారుతున్నాయి.. అభ్యర్థులదే ఎంపిక!