Kambhampati Haribabu : మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ లను రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు. వీరితో పాటు 8 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు.

Kambhampati Haribabu : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. దీంట్లో భాగగా ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మధ్యప్రదేశ్ కు మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, కర్నాటకకు థావర్ చంద్ గెహ్లాట్,గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌ లను రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు.

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రస్థానం..
నుంచి 16 వ లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా గెలిచారు. హ‌రిబాబు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ప్ర‌త్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన జై ఆంధ్ర ఉద్య‌మంలో విద్యార్థి నాయ‌కుడిగా ఆయ‌న తెన్నేటి విశ్వ‌నాథం, స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న మ‌రియు వెంక‌య్య నాయుడుల‌తో క‌లిసి పాల్గొన్నారు.

రాజకీయ జీవితం
హరిబాబు ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గార్లతో విద్యార్థి నాయకుడిగా కలిసి 1972-73 మధ్య కాలంలో ఆంధ్రా యూనివర్శిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థుల యూనియన్ కు సెక్రటరీగా పనిచేశారు. 1974-75 కాలంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అధ్వర్యలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో పనిచేశారు. అలా పలు ఉద్యమాల్లోపాల్గొన్న హరిబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1991-1993 హరిబాబు భారతీయ జనతా పార్టీకి ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేసారు. ఆ తరువాత ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీగా కొనసాగాడు. 1999లో విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా..2003 ఏపీ భారతీయ జనతా పార్టీ ప్లోర్ లీడర్ గా కొనసాగారు. 2014 లోబీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ నియోజ‌కవ‌ర్గం నుంచి ఎంపీగా పనిచేశారు.

ట్రెండింగ్ వార్తలు