జైట్లీ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. జైట్లీ కుటుంబసభ్యులను కోవింద్ ఓదార్చారు.

జైట్లీ మరణం దేశానికి తీరని లోటు అని ఆయన అన్నారు. జైట్లీ మరణం తనను ఎంతగానో బాధించిందని రాష్ట్రపతి తెలిపారు. అంతకుందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్,బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా,విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, రవిశంకర్ ప్రసాద్,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా పలువురు జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.