Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ వేడుకకు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవర్, పలువురు ఎంపీలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరంతా నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందచేశారు.
చదవండి : Vice President Venkaiah: భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
ఇక డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక డిసెంబర్ 17తేదీన విశాఖ రిషెప్షన్ జరగ్గా.. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి : Parliament : రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్