చెరో రెండున్నరేళ్లు అంటూ శివసేన మెలిక పెట్టడంతో బీజేపీ నైనై అంటుంది. శివసేన మాత్రం అందుకు ఒప్పుకుంటేనే సై సై అంటుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం దాటినా కూడా బీజేపీకి శివసేనతో వ్యవహారం కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందంటూ బీజేపీ నేత సుధీర్ ముంగంటివర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీజేపీ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి పాలన పేరిట భాజపా బెదిరింపులకు దిగుతోందా? అంటూ ప్రశ్నించారు. త్వరలో ప్రభుత్వం ఏర్పాటుపై వేచి చూసే ధోరణిని వీడతామని అన్నారు. ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్రకు అవమానం అని అన్నారు. రాష్ట్రపతి ఏమైనా మీ జేబులో ఉన్నారా? అని ప్రశ్నించారు.
శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో ముంగంటివర్ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని, మహారాష్ట్ర ప్రజల తీర్పుని అవమానించడం కరెక్ట్ కాదని రాసుకొచ్చారు. బీజేపీ వైఖరి విషపూరితంగా మారిందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అంటూ గట్టి ఆరోపణలు చేసింది. ‘రాష్ట్రపతి బీజేపీ నియంత్రణలో ఉన్నారా? లేక రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా?’ అంటూ విమర్శలు చేసింది.
‘రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగం కల్పించిన ఒక అత్యున్నత వ్యవస్థ. రాష్ట్రపతి ఒక వ్యక్తి కాదు.. దేశం మొత్తానికి ప్రతినిధి. దేశం ఎవరి జేబుల్లో లేదు’ అంటూ సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ‘‘మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 8వ తేదీతో ముగియనుంది. ఈలోపు ప్రభుత్వం ఎర్పాటు చేయాలనేది బీజేపీ వెర్షన్. అయితే శివసేన మాత్రం పట్టు విడవట్లేదు.