Gold Rate: బంగారం, వెండి ధరలు పెరగడానికి మరో కారణం..

బంగారం, వెండి నగల ధరలు త్వరలో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చుతగ్గుల ఆధారంగా పెరిగే గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఇతర కారణాలతో పెరిగే...

Gold Rate: బంగారం, వెండి నగల ధరలు త్వరలో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చుతగ్గుల ఆధారంగా పెరిగే గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఇతర కారణాలతో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా ప్రస్తుతమున్న జీఎస్టీ రేటును జీఎస్టీ ఫిట్‌మెంట్ పెంచే యోచనలో ఉండటమే. ఇటీవలే నూలు, వస్త్రాలు, హ్యాండ్ మేడ్ ఫైబర్ లపై జనవరి 1నుంచి 12శాతం జీఎస్టీ అమలు చేస్తామని చెప్పేసింది.

దానికి అనుగుణంగానే దుస్తులపై ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుండగా.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు కూడా అదే జాబితాలో చేరిపోనున్నాయి.

ప్రస్తుతం అమలవుతున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ స్లాబ్‌ రేట్లను జీఎస్టీ ఫిట్‌మెంట్‌ కమిటీ సవరించాలని ప్రతిపాదించింది. 5 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 7 శాతానికి, 18 శాతంగా ఉన్న స్లాబ్‌ రేటును 20 శాతానికి పెంచాలని ఈ కమిటీ సూచించింది. కొన్నింటికి వేర్వేరుగా విధిస్తున్న 12, 18 శాతం స్లాబ్‌ రేట్లను కలిపి 17 శాతం చేయాలన్న ప్రతిపాదన కూడా చేసింది.

……………………………………………….. : ‘పాప్ కార్న్’ మేఘాలు… ఎప్పుడైనా చూశారా? వినువీధిలో వింత

ఈ క్రమంలోనే బంగారం, వెండి వస్తువులపై 3 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి పెంచాలని కమిటీ సూచించింది. ఈ కమిటీ ప్రతిపాదనలను మంత్రులతో కూడిన ఉపసంఘం నవంబర్ 27న సమావేశమై ఆమోదం తెలిపిన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో తుది నిర్ణయం వెల్లడిస్తారు.

ట్రెండింగ్ వార్తలు