PM Modi : పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం .. అన్ని పార్టీలు సహకరించాలి : ప్రధాని మోడీ

వాడీవేడిగా శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాలం కావటంతో బయట వాతావరణం చల్లగా ఉన్నా..పార్లమెంట్ సభల్లో మాత్రం వాతావరణం హాట్ హాట్ గా ఉండనుంది. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం అని దయచేసిన అన్ని పార్టీల సభ్యులు సభ నిరాటంకంగా కొనసాగటానికి సహకరించాలని కోరారు. యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని సూచించారు.

PM Modi : వాడీవేడిగా శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాలం కావటంతో బయట వాతావరణం చల్లగా ఉన్నా..పార్లమెంట్ సభల్లో మాత్రం వాతావరణం హాట్ హాట్ గా ఉండనుంది. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం అని దయచేసిన అన్ని పార్టీల సభ్యులు సభ నిరాటంకంగా కొనసాగటానికి సహకరించాలని కోరారు. యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని సూచించారు. అంశాలపై సమగ్రంగా చర్చ జరిగేలా అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని సమగ్ర చర్చ జరగకపోతే నష్టం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతీ సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం (డిసెంబర్ 7,2022)నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరుగనున్నాయి. ఈ సమావేశాలపై గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలవ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని అంశాలపై సమాధానం చెప్పేందుకు సిద్ధమన్న కేంద్రం.. సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష భేటీలో కోరింది.

17రోజులi 17 బిల్లులు..
ఈ సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉభయ సభలు మొత్తం 17రోజులపాటు సమావేశం కానుండగా.. కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులు ప్రవేశపెట్టనుంది. వాటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ-స్టేట్ కోపరేటివ్ సొసైటీలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ మూడు బిల్లులను స్థాయీసంఘం పరిశీలనకు పంపాలని.. వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.

శీతాకాల సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చడం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ఈడబ్ల్యూఎస్​ కోటా అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలవ పతనం, ఎగుమతుల తగ్గుదల, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్​టీ పన్నుల అంశాలు కూడా ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర విపక్షాల నేతలు తెలిపారు.

వచ్చే బడ్జెట్‌ సమావేశాలను నూతన భవనంలో..
శీతాకాల సమావేశాల్లో కోఆపరేటివ్‌ సొసైటీల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, కంటోన్‌మెంట్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో విపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రస్తుత పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలే చివరివి కాగా.. వచ్చే బడ్జెట్‌ సమావేశాలను నూతన భవనంలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాబోరని తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు