PM Modi Varanasi Tour : దివ్యాంగురాలి పాదాలకు మొక్కిన ప్రధాని మోదీ.. ఫొటో వైరల్
ప్రధాని మోదీ తాజాగా వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ఆయన కలిసేందుకు వచ్చిన ఓ దివ్యంగురాలి పాదాలకు మొక్కారు మోదీ
- kunduru Vinod
- Published On : December 16, 2021 / 02:37 PM IST
Pm Modi Varanasi Tour
PM Modi Varanasi Tour : సోమ, మంగళవారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ఆయన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించారు. కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని కారిడార్ ప్రారంభించారు. కాశీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసేందుకు దివ్యంగురాలైన శిఖా రాస్తోంగి ముందుకు వచ్చారు. ఇదే సమయంలో మోదీ ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రధాని మోదీనే ఆమె పాదాలకు మొక్కారు.
చదవండి : PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ
ఈ ఫోటోను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ తన ట్విట్టర్‌లో షేర్ చేసి, ఇది మహిళా శక్తికి గౌరవం అని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శిఖా పాదాలకు మొక్కిన అనంతరం మోదీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా శిఖాకు నమస్కరించి అభినందనలు తెలిపారు.
చదవండి : PM Modi : బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ
దీంతో పాటు మున్సిపల్ కార్మికులతో మోదీ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మున్సిపల్ కార్మికులతో మోదీ ఫోటో దిగేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఫోటో దిగే ప్రాంతంలో మోదీకోసం అధికారులు కుర్చీ ఏర్పాట్లు చేయగా.. దానిని ఆయన పక్కకు పెట్టి.. కార్మికుల మధ్యలో కూర్చొని ఫోటో దిగారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
చదవండి : PM Modi: సౌత్‌పై ప్రధాని మోదీ గురి
यह सम्मान समस्त नारी शक्ति का सम्मान है । गर्व है हम सभी को अपने प्रधानमंत्री श्री @narendramodi जी पर । pic.twitter.com/L989Wp8Ukl
— Vanathi Srinivasan (@VanathiBJP) December 15, 2021
