Mahakal Corridor
Mahakal Corridor: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో “శివలీల” (108 కుడ్యచిత్రాలు, పురాతణ కథలను వివరించే 93 విగ్రహాలు) ఆధారంగా నిర్మించబడిన కొత్తగా ప్రాజెక్ట్ మహాకాల్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు. మంగళశారం సాయంత్రం ప్రధాని మోదీ కార్తిక్ మేళా గ్రౌండ్‌లో ప్రజల సమక్షంలో పూజా కార్యక్రమాల తరువాత ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
Mahakal Corridor
మహా కాళేశ్వర్ కార్యాలయంలో కారిడార్ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. కారిడార్ యొక్క మొదటి దశ నిర్మించడానికి రూ.350 కోట్ల ఖర్చు అవుతుంది. దీనిని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభిస్తారు. మంగళవారం ఉజ్జయినిలో తొలి క్యాబినెట్ సమావేశం తర్వాత తాజాగా నిర్మించిన కారిడార్‌ను మహాకాల్ లోక్ అని పిలుస్తామని సిఎం చౌహాన్ ప్రకటించారు.
Mahakal Corridor
ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో మహాకాల్ దేవాలయం, రుద్రసాగర్ సరస్సు, వంతెన నిర్మాణం, సరస్సు ఒడ్డు, మహాకాళేశ్వర్ వాటిక, ధర్మశాల, అన్నక్షేత్రం (ఫుడ్ హాల్), ఒక బోధనా మందిరం వంటి వాటిని అందుబాటులోకి తెస్తారు. అదేవిధంగా తామర చెరువు కూడా అందుబాటులోకి వస్తుంది. అయితే, పునరుద్ధరణ పూర్తయితే ఆలయ స్థలం దాదాపు ఎనిమిది రెట్లు పెరుగుతుంది.
Mahakal Corridor
మౌలిక సదుపాయాల మెరుగుదలలో భాగంగా కాంప్లెక్స్‌కు ప్రవేశ దారులను విభజించారు. పార్కింగ్ స్థలాలను అప్‌గ్రేడ్ చేశారు, ఆలయానికి వచ్చే సందర్శకులకు ప్రవేశం, బయలుదేరే పాయింట్లను అవాంతరాలు లేకుండా చేశారు. మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీ చక్రయంత్రం తిరగవేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాత:కాలం భస్మాభిషేకం చేస్తారు.
Mahakal Corridor
ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఆలయ సముదాయానికి ప్రవేశద్వారం పాదచారుల మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ ప్రాంతం శివుని గురించి కథలు చెప్పే స్మారక చిహ్నాలు, కుడ్యచిత్రాలతో నిండి ఉంది. ఈ మార్గంలో, రెస్టారెంట్లు, రిటైల్ సంస్థలు అందుబాలో ఉంటాయి.
Mahakal Corridor
మహకాల్ దేవాలయం నేపథ్యం, ప్రాముఖ్యత..
శివుడిని మహాకాళేశ్వర్ అని పిలుస్తారు. ఇది సంస్కృతంలో “కాలానికి ప్రభువు”. ప్రస్తుతం పూజ్యమైన క్షిప్రా నది పక్కన ఉన్న ఈ దేవాలయాన్ని మొదట హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు నిర్మించాడు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శివుని అత్యంత పవిత్రమైన నివాస స్థలాలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. చరిత్ర ప్రకారం.. ఆలయంలోని మహాకాళ లింగం స్వయంభూ (స్వయం స్వరూపం)గా భావించబడుతుంది. దేశంలోని ఇతర జ్యోతిర్లింగాలకు భిన్నంగా, మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంది.
Mahakal Corridor
భస్మ-ఆరతి అనేది దేవతను మేల్కొలపడానికి, అభిషేకం చేయడానికి, శివునికి మొదటి అగ్ని నైవేద్యాన్ని సమర్పించడానికి ఆలయంలో ఉదయం నిర్వహించే మొదటి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా వందలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం భారతదేశంలోని 18 మహా శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
Mahakal Corridor
మరాఠా జనరల్ రాణోజీ షిండే 1734 క్రీ.శ లో ప్రస్తుత ఆకృతిలో ఆలయాన్ని నిర్మించారు. స్వాతంత్య్రానికి ముందు దేవ్ స్థాన్ ట్రస్ట్ ఆలయాన్ని చూసుకునేది. స్వాతంత్ర్యం తరువాత ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ తన స్థానాన్ని ఆక్రమించింది. ఆలయ నిర్వహణ ప్రస్తుతం ఉజ్జయిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆధీనంలో ఉంది.
Mahakal Corridor
ఆలయం, చుట్టుపక్కల భూములను కలిగి ఉన్న మహాకాల్ కాంప్లెక్స్‌ను విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి 2017లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు ఆవిష్కరించింది. రుద్రసాగర్ సరస్సుతో సహా 2.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఆలయ సముదాయం ప్రస్తుత పరిమాణం 40 హెక్టార్లకుపైగా పెరుగుతుంది. పునర్నిర్మాణకు రూ. 705 కోట్లు వ్యయం ప్రణాళిక అంచనా వేశారు.
Mahakal Corridor
మహాకాల్ మహారాజ్ మందిర్ ప్రాజెక్ట్ రెండు దశల్లో నిర్వహించబడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం 1.50 లక్షల నుండి మూడు కోట్లకు సిటీ ట్రాఫిక్‌ను పెంచుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుతం ప్రాజెక్టు తొలిదశ పూర్తయింది. ఈ మెగా కారిడార్ లో శివలింగాన్ని ఆశిష్కరించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
https://twitter.com/ShobhaBJP/status/1579133793398829056?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579133793398829056%7Ctwgr%5E045ecccc9252dc59e203f69e07e599123f6647f4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsakshi-special%2Fpm-modi-likely-inaugurate-ujjain-mahakal-corridor-key-features-1492905
రూ.310.22 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశలో భాగంగా ఆలయ తూర్పు, ఉత్తర ముఖభాగాలను విస్తరించనున్నారు. మహారాజ్‌వాడ, మహల్ గేట్, హరి ఫాటక్ బ్రిడ్జి, రామ్‌ఘాట్ ముఖభాగం, బేగం బాగ్ రోడ్‌తో సహా ఉజ్జయిని నగరంలోని వివిధ భాగాలు కూడా పునర్నిర్మించబడుతున్నాయి. మహాకాల్ ఆలయ సముదాయం మహారాజ్‌వాడలోని నిర్మాణాలకు అనుసంధానించబడుతుంది. చారిత్రక ధర్మశాల, కుంభ్ మ్యూజియం కూడా అభివృద్ధి చేయబడుతుంది.