Narendra Modi: జపాన్‌లో ప్రవాస భారతీయులతో మాట్లాడిన మోదీ.. వీడియో

హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ శాంతి సందేశంగా ఉండనున్న గాంధీ విగ్రహం నిలవనుంది.

Japan: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జపాన్ లో పర్యటిస్తున్నారు. జీ7 (G7) సదస్సులో అతిథి దేశంగా పాల్గొనాలని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా మోదీని ఆహ్వానించారు. దీంతో ఈ సదస్సులో మోదీ పాల్గొంటున్నారు. హిరోషిమాలోని హోటల్ కు చేరుకున్న మోదీ అక్కడ ప్రవాస భారతీయులతో (Indian diaspora) కాసేపు మాట్లాడారు.

మోదీని కలవడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, భారత్ జీ-20కి నేతృత్వం వహిస్తున్న సమయంలో తాను జీ7 సదస్సుకు హాజరు అవుతుండడాన్ని గుర్తు చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. జీ7 సదస్సులో పాల్గొనడంతో పాటు మోదీ కొందరు నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొంటారు.

హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ శాంతి సందేశంగా ఉండనున్న గాంధీ విగ్రహం నిలవనుంది. చైనా తీరుపై పలు దేశాలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. జీ7 దేశాల సదస్సులో తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని చైనా ఆందోళన చెందుతోంది. జపాన్ చేరుకున్న సందర్భంగా మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

Rs 2000 Denomination: పెద్ద నోట్లు రద్దు చేయాలని నేను అప్పుడే చెప్పాను: చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు