Gujarat Modi : ఘన విజయం తర్వాత.. తల్లితో కలిసి భోజనం చేసిన మోదీ

నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మ్రోగించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. రెండు రోజుల పాటు పర్యటనలో శుక్రవారం ఆయన అహ్మదాబాద్ విమనాశ్రయం...

Gujarat Modi : ఘన విజయం తర్వాత.. తల్లితో కలిసి భోజనం చేసిన మోదీ

Modi Mother

Updated On : March 12, 2022 / 5:17 PM IST

Narendra Modi Meets His Mother : ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తల్లి దగ్గరకు వెళ్లి..ఆశీస్సులు తీసుకోవడం అలవాటు. ఆమెతో కాసేపు ముచ్చటించడం, భోజనం చేయడం వంటివి చేస్తుంటారాయన. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘అఖండ’ విజయం సాధించింది బీజేపీ. నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మ్రోగించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. రెండు రోజుల పాటు పర్యటనలో శుక్రవారం ఆయన అహ్మదాబాద్ విమనాశ్రయం చేరుకున్నారు. అక్కడ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Read More : మోదీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్..?

ఎయిర్ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. పూలు జల్లుతూ.. మోదీకి స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ.. కృతజ్ఞతలు తెలియచేస్తూ.. ముందుకు కదిలారు. అనంతరం జీఎండీసీ గ్రౌండ్ లో నిర్వహించిన మహా పంచాయత్ సమ్మేళన్ లో పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్ లో ఉంటున్న సోదరుడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ తల్లి హీరాబెన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More : PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర చేసింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల సత్తా చాటింది. దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాల్లో ఘన విజయంతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లలోనూ అధికారం నిలబెట్టుకుంది బీజేపీ. గోవాలో 20 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. పంజాబ్‌లో మాత్రం ఆప్ విజయం సాధించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నమోదు చేయడం, ప్రతిపక్ష పార్టీల అడ్రెస్ గల్లంతవడంతో గుజరాత్ లోనూ భారీ విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శనివారం జరగనున్న పలు సాంస్కృతిక, ఆటల పోటీలకు మోదీ హాజరవుతారు. ఇటీవల నిర్మించిన సర్ధార్ పటేల్ స్టేడియంలో గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే “ఖేల్ మహాకుంభ్” కార్యక్రమానికి మోదీ హాజరౌతారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా 1100 మంది సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు.