PM Modi Speech: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. సర్వత్రా ఉత్కంఠ

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని మండిపడ్డారు. ఈ విషయంలో వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

  • Updated on- April 18, 2026 / 04:44 PM IST
  • జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ
  • రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసంగం
  • మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
  • మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రతిపక్షాల తీరుపై సీరియస్

PM Modi Speech: ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. మమిళా రిజర్వేషన్ల చట్ట అమలుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొన్న మోదీ.. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని మండిపడ్డారు. ఈ విషయంలో వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

మహిళా బిల్లును వీగిపోయేలా చేసి ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకం అనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరేలా తెలియజేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో జాతిని ఉద్దేశించి మోదీ చేయనున్న ప్రసంగం ఆసక్తికరంగా మారింది. మహిళా బిల్లు విషయంలోనే ప్రతిపక్షాలను కార్నర్ చేసేలా ఆయన ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది.

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లు.. నెక్ట్స్ ఏంటి? ఎన్డీయే సర్కార్ కొత్త ప్లాన్ ఏంటి?