భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో మోడీ ఫాలోయింగ్ గురించి ఇక చెప్పేదేంవుంటది. తాజాగా మోడీ ట్విటర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లు దాటింది. భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు మోడీకే ఉన్నారు.
ఇక భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోడీ దక్కించుకున్నారు. 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ట్విటర్ ఖాతాను ప్రారంభిచారు మోడీ. 2014లో ప్రధాని పదవి చేపట్టడంతో ఆయనకు ఆదరణ బాగా పెరిగింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా ట్వీట్లు చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఆయన పర్యటనలు, తాను కలిసి ముఖ్యవ్యక్తుల వివరాలు, వివిధ వేదికల్లో ఆయన చేసిన ప్రసంగాలు తదితర అంశాలపై మోడీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
ప్రపంచస్థాయి నాయకుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 120 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 83 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.