UK PM Boris Johnson : అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికారు.

UK PM Boris Johnson Visits Sabarmati Ashram : భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్ గుజరాత్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బోరిస్ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని ఆశ్ర‌మంలో మ‌హాత్మా గాంధీ వాడిన నూలు చ‌ర‌ఖ‌ను తిప్పి తిప్పారు. నూలు వడికారు. చరఖా తిప్పి నూలు వడకటంలో బోరిస్ జాన్సన్ కు ఆశ్రమ నిర్వాహకులు సహాయం చేశారు. సబర్మతి ఆశ్రమ సందర్శన సంద‌ర్భంగా బోరిస్ జాన్సన్ విజిట‌ర్స్ బుక్‌ పై సంత‌కం చేశారు.

లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ కి..గుజరాత్‌ గవర్నర్ ఆచార్య దేవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు,మంత్రులు సాదర స్వాగతం పలికారు. అయితే అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్…సబర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించి గాంధీజీ వాడిన నూలు చ‌ర‌ఖ‌ను బ్రిటన్ ప్రధాని తిప్పి నూలు వడికారు.

Also read : UK PM Johnson : భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్.. నేడు గుజరాత్‌లో పర్యటన..!

ఓ అసాధార‌ణ వ్య‌క్తికి చెందిన ఆశ్ర‌మాన్ని విజిట్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని, ప్ర‌పంచాన్ని ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు స‌త్యం, అహింసా సిద్ధాంతాల‌ను గాంధీ ఎలా వాడ‌ర‌న్నది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని ఆ బుక్‌ లో బోరిస్ రాశారు. గాంధీజీ రాసిన గైడ్ టు లండ‌న్ అన్న పుస్త‌కాన్ని బోరిస్‌ కు గిఫ్ట్‌ గా ఇచ్చారు.

కాగా..బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావటం గమనించాల్సిన విషయం. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈరోజు గుజరాత్ పర్యటనలో బోరిస్ జాన్సన్..గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌ ను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు.ఆ తరువాత ఆయన ఢిల్లీకి పయనమవుతారు.

 

ట్రెండింగ్ వార్తలు