Priyanka Gandhi hilarious reaction
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల నాయకులు విజయమే లక్ష్యంగా విరామం లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ నాయకుడు ఆమెకు బొకే ఇవ్వగా దాన్ని చూసిన ఆమె నవ్వకుండా ఉండలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో సోమవారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక పైకి వచ్చి ప్రియాంక గాంధీని ఒకరి తరువాత ఒకరు వచ్చి కలిశారు. ఈ క్రమంలో ఓ నాయకుడు ప్రియాంకను కలిసి బొకే అందించారు. దాన్ని చూసిన వెంటనే ఆమె తొలుత ఆశ్చర్యపోయింది. తరువాత నవ్వుకుంది. ఎందుకంటే ఆ బొకేలో పూలు లేకపోవడమే దీనికి కారణం.
Also Read: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తే ఆప్ ఏం చేయనుందంటే…
ఆ తరువాత ప్రియాంక గాంధీ సరదాగా సదరు నేతను ఆటపట్టించారు. ఆ బొకేను చూపిస్తూ పూలు ఎక్కడ ఉన్నాయి..? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
गुलदस्ता घोटाला ?
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया ??
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023