Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య గురించి అడిగి ప్రియాంక బోరున విలపించారు.. నళిని శ్రీహరన్

రాజీవ్ కేసులో దోషులుగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవిచంద్రన్ వురపు రవిలను శుక్రవారం విడుదల చేసింది

Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాని దోషి అయిన నళిని శ్రీహరన్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ తనను దశాబ్దంన్నర క్రితం జైల్లో కలిశారని, ఆ సమయంలో తన హత్య గురించి బోరున విలపించారని ఆమె ఆదివారం వెల్లడించారు. ప్రియాంక గాంధీ 2008లో వెల్లూరు జైలులో ఉన్న నళినిని కలిశారు. ఆ సమయంలో ప్రియాంక తనతో మాట్లాడిన మాటలను నళిని ఆదివారం వెల్లడించారు.

‘‘తన తండ్రి రాజీవ్ హత్య గురించి ప్రియాంక నన్ను అడిగారు. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తీవ్రంగా విలపించారు. అప్పుడు ఆమెకు రాజీవ్ హత్య గురించి తనకు తెలిసిన విషయాలను చెప్పాను’’ అని నళిని అన్నారు. అయితే ప్రియాంకతో పంచుకున్న వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను తాను వెల్లడించబోనని నళిని అన్నారు.

రాజీవ్ కేసులో దోషులుగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవిచంద్రన్ వురపు రవిలను శుక్రవారం విడుదల చేసింది. రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ విజ్ఞప్తి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు ఆధారంగా తమిళనాడు గవర్నర్ 2000వ సంవత్సరంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నళినికి కోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.

మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు, అనంతరం అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. కుమార్తెను చూసుకోవాలన్న అభ్యర్థన మేరకు మొదట నళిని మరణశిక్షణు యావజ్జీ కారాగార శిక్షగా ధర్మాసనం మార్చింది. సెప్టెంబర్ 9, 2018న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. అనంతరం అది అనేక మలుపులు తిరిగింది. ఎట్టకేలకు నవంబర్ 11 న దోషులందరూ విడుదల అయ్యారు.

Bihar Politics: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

ట్రెండింగ్ వార్తలు