Bihar Politics: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మిస్తానని చెప్తుండడంతో పదే పదే ఎన్నికల రాజకీయంపై ఆయన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

Bihar Politics: ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

Lok Sabha elections-2024

Bihar Politics: ఎన్నికల్లో పోటీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టతనిచ్చారు. తాను పోటీ చేయబోనని చెప్తూనే పోటీ చేయాల్సిన అవసరం ఏంటని ఎన్నికల పోటీపై ప్రశ్నించిన వారికి తిరుగు ప్రశ్న వేశారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు పీకే పై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మిస్తానని చెప్తుండడంతో పదే పదే ఎన్నికల రాజకీయంపై ఆయన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.

మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేకర్లు పదే పదే అడిగినపుడు ప్రశాంత్‌ కిశోర్ స్పందిస్తూ ‘‘నెనెందుకు ఎన్నికల్లో పోటీ చేయాలి? నాకు అలాంటి కోరికలు లేవు’’ అని సమాధానం చెప్పారు. ఆయన ప్రస్తుతం జన సురాజ్ యాత్ర చేస్తున్నారు. దీనిని రాజకీయ పార్టీగా మార్చాలా? వద్దా? అని ప్రజలను ఆయన కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం పశ్చిమ చంపారన్ జిల్లాలో ఆదివారం సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని పీకే చెప్పారు.

ఇక, తనపై అధికార కూటమిలోని జేడీయూ నేతలు మిడిమిడి రాజకీయ చతురతగల వ్యాపారి అని విమర్శించడంపై పీకే ఘాటుగా సమాధానం ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్ రెండేళ్ల పాటు ఆయన నివాసంలో తనకు ఎందుకు స్థానం ఇచ్చారో ప్రశ్నించండని జేడీయూ నేతలకు సవాల్ విసిరారు. ఇలాంటి వారే తాను మళ్లీ జేడీయూలోకి వెళ్తే ప్రశంసలు కురిపిస్తారని పీకే అన్నారు.

Karnataka: మోదీ ర్యాలీకి వెళ్తే ₹500 ఇస్తామని చెప్పి ₹200 మాత్రమే ఇచ్చారు.. బీజేపీపై ఆరోపణలు